హనుమంతుడు దళితుడు కాదు, ముస్లిం కాదు.. జాట్ కులస్తుడు: యూపీ మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి

  • సమస్యల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు జాట్లు ముందుకు కదులుతారు
  • సీతాదేవిని కాపాడేందుకు హనుమంతుడు వెళ్లాడు
  • జాట్లకు ఉన్న స్వభావమే హనుమంతుడికి ఉంది
హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే హనుమంతుడిది ఏ కులం, ఏ మతం అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వివాదానికి తొలుత ఆజ్యం పోసింది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. హనుమంతుడు దళిత వర్గానికి చెందినవాడని ఆదిత్యనాథ్ అన్నారు. ఆ తర్వాత హనుమంతుడు ముస్లిం అంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో యూపీ మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి చేరారు. హనుమంతుడు దళితుడు కాదు, ముస్లిం కాదని... ఆయన జాట్ కులానికి చెందినవాడని చౌదరి అన్నారు.

హనుమంతుడు జాట్ అని తాను నమ్ముతున్నానని చౌదరి చెప్పారు. ఎవరైనా సమస్యల్లో ఉంటే వారికి సాయం చేసేందుకు జాట్లు ముందుకు కదులుతారని... అవతల ఎంత పెద్ద సమస్య ఉన్నా జాట్లు ఆలోచించరని అన్నారు. వైశ్యులు అగ్రసేనుడి వారసులనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలమని... ఎందుకంటే అగ్రసేనుడు స్వయంగా వ్యాపారి అని చెప్పారు. ఇదే విధంగా సీతాదేవిని కాపాడేందుకు హనుమంతుడు వెళ్లాడని... జాట్లకు ఉన్న స్వభావమే ఆయనకు ఉందని... అందుకే ఆయనను జాట్ గా భావిస్తున్నానని తెలిపారు. 
Go Back to Shorts
hanuman
caste
lakshminarayana choudary
Uttar Pradesh

More Telugu News