President Of India: శీతాకాల విడిది కోసం భాగ్యనగరం విచ్చేస్తున్న రాష్ట్రపతి
- నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో
- సాయంత్రం 5.05 గంటలకు ప్రత్యేక విమానంలో రాక
- 24న తిరిగి ఢిల్లీకి బయుదేరి వెళ్లనున్న ప్రథమ పౌరుడు
హైదరాబాద్ మహానగరంలో నాలుగు రోజులపాటు విడిది చేసేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం సాయంత్రం విచ్చేస్తున్నారు. ఏటా శీతాకాలంలో కొన్ని రోజులపాటు హైదరాబాద్ నగరంలో రాష్ట్రపతి గడపడం ఆనవాయితీ. ఈ ఏడాది డిసెంబరు 21 నుంచి 24 వరకు కోవింద్ భాగ్యనగరంలో విడిదిచేసి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ రోజు సాయంత్రం 5.05 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే కోవింద్‌కు విమానాశ్రయంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. 22న ఉదయం కరీంనగర్‌లోని ప్రతిమ వైద్య కళాశాలలో జరిగే సదస్సులో పాల్గొంటారు. 23న రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఆతిథ్యమిస్తారు. 24న తిరుగు ప్రయాణం అవుతారు.