- నాకు ఆత్మగౌరవమే ముఖ్యం
- పదవులను పట్టుకుని వేలాడను
- మరోసారి మీడియా సమావేశం నిర్వహిస్తా
తనకు పదవులు ముఖ్యం కాదనీ, అత్మగౌరవమే ముఖ్యమని కాంగ్రెస్ నేత కొండా మురళి తెలిపారు. పదవులు పట్టుకుని వేలాడటం తమ లక్షణం కాదని స్పష్టం చేశారు. నమ్ముకున్న నేత జగన్ కోసం అప్పట్లో ఏకంగా మంత్రి పదవినే తన భార్య సురేఖ వదులుకుందని వ్యాఖ్యానించారు. వరంగల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ టికెట్ పై నెగ్గిన ఎమ్మెల్సీ పదవికి త్వరలోనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజీనామా చేశాక మరోసారి మీడియా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.