రాఫెల్ స్కామ్ కు సంబంధించి జేపీసీ ఏర్పాటు చేయాలి!: వీరప్ప మొయిలీ డిమాండ్
- దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్’
- రెండొందల శాతం అంచనాలు పెంచారు
- సుప్రీంకోర్టుకు కేంద్రం తప్పుడు నివేదికలు ఇచ్చింది
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్’ అని, దేశభద్రతను పణంగా పెట్టి ఈ ఒప్పందం చేసుకున్నారని బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. రెండొందల శాతం అంచనాలు పెంచి ఈ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు కేంద్రం తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించిన మొయిలీ, దీనికి సంబంధించిన ‘కాగ్’ నివేదికను పీఏసీకి ఇంతవరకూ ఇవ్వలేదని అన్నారు. రాఫెల్ స్కామ్ కు సంబంధించి జేపీసీ వేయాలని ఈ సందర్భంగా వీరప్ప మొయిలీ డిమాండ్ చేశారు.