రాజమౌళి తండ్రి పాదాలకి నమస్కరించిన కంగనా రనౌత్
- కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా 'మణికర్ణిక'
- కంగనా కెరియర్లో ప్రత్యేక చిత్రం
- జనవరి 25వ తేదీన విడుదల
ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర అందరికీ తెలిసిందే అయినా, సినిమాటిక్ గా ఈ కథను విజయేంద్ర ప్రసాద్ అద్భుతంగా మలిచారు. అందువల్లనే ఆమె ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసింది. తన కెరియర్లో చెప్పుకోదగిన సినిమా కావడంతో, అందుకు ఎంతో కృషి చేసిన కారణంగా విజయేంద్ర ప్రసాద్ ఆశీర్వాదం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ తప్పుకోవడానికి కంగనానే కారకురాలు అని తెలుగువాళ్లు అసహనానికి లోనయ్యారు. ఆమె విజయేంద్ర ప్రసాద్ పాదాలకి నమస్కరించడంతో వాళ్ల మనసులు తేలికపడి వుంటాయని చెప్పొచ్చు.