అదరగొట్టేస్తోన్న 'మణికర్ణిక' ట్రైలర్
- వీరనారిగా కంగనా రనౌత్
- పాత్రలో ఒదిగిపోయిన కంగనా
- జనవరి 25వ తేదీన విడుదల
యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం .. గుర్రపుస్వారిలో నైపుణ్యాన్ని కనబరచడం .. వివాహం .. ఆంగ్లేయ సైన్యంపై విరుచుకు పడటం .. భర్తను కోల్పోవడం .. వంటి ఘట్టాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. భారీతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. కంగనా ఈ పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందనేది ఈ ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. జనవరి 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.