అమిత్ షా రథయాత్రకు అడ్డుకట్ట.. కోర్టును ఆశ్రయించనున్న బీజేపీ
- మమతా బెనర్జీ తీరుపై హైకోర్టులో అప్పీల్ చేస్తాం
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది
- ఎమర్జెన్సీ దిశగా సాగుతోంది
రథయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని మమతా బెనర్జీ చెబుతున్నారని... అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీసులు ఉండి ఏం ప్రయోజనమని దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమయిందని చెప్పడానికి మమత వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితి ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) దిశగా సాగుతోందని చెప్పారు.