11 ఏళ్ల బాలికపై తొమ్మిదో తరగతి విద్యార్థి అత్యాచారం
- ఇరుగు పొరుగు ఇళ్లల్లో నివాసం
- పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం
- మైనర్ కావడంతో అరెస్ట్ చెయ్యట్లేదు
ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ గోస్వామి మాట్లాడుతూ.. బాధితురాలు, నిందితుడు ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తుంటారని తెలిపారు. బుధవారం బాలికను పొదల్లోకి తీసుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని.. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. నిందితుడు మైనర్ కావడంతో అతన్ని అరెస్ట్ చేయట్లేదని.. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు గోస్వామి వెల్లడించారు.