Chandrababu: మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపునకు చంద్రబాబు కృషే కారణమట!: వైసీపీ నేత బొత్స వ్యంగ్యాస్త్రాలు

షార్ట్స్‌లో చూడండి
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడానికి తాను చేసిన కృషే కారణమన్న చంద్రబాబు వ్యాఖ్యలు వింటుంటే తనకు నవ్వొస్తోందని వైసీపీ నేత బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం మాయమాటలను ప్రజలు నమ్మొద్దని కోరుతున్నానని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తుకు యత్నించి విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ని టీడీపీ నెత్తినపెట్టుకోవాలని చూసిందని, అసలు చంద్రబాబును ఓటుకు నోటు కేసులో శిక్షించి ఉంటే నేటి పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు బాబు యత్నించారని, దానికి ప్రతిగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తే, ఇందులో వైసీపీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.  

నాడు కేసీఆర్ యాగానికి చంద్రబాబు వెళ్లారని, రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు కేసీఆర్ ను బాబు ఆహ్వానించారని విమర్శించారు. నిన్నటి వరకు బీజేపీ, జనసేనతో వైసీపీ కలిసిపోయిందని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడేమో కేసీఆర్ కు- వైసీపీకి సంబంధముందని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
botsa
ysrcp

More Telugu News