ఫస్టు సాంగ్ తో పలకరించనున్న 'మిస్టర్ మజ్ను'
- రొమాంటిక్ హీరోగా అఖిల్
- ఈ నెల 25వ తేదీన టీజర్ రిలీజ్
- వచ్చేనెల 25న సినిమా విడుదల
ఈ సినిమా నుంచి 'ఏమైనదో' అనే ఒక సాంగ్ ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వదిలిన పోస్టర్ కూడా ఆకట్టుకునేలా వుంది. ఈ నెల 25వ తేదీన టీజర్ ను .. జనవరి 25వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు ఆశించినస్థాయి ఫలితాలను అందించకపోవడంతో, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో అఖిల్ వున్నాడు. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.