తెలంగాణలో జరిగినట్లే ఏపీలోనూ ఓట్ల మిస్సింగ్ జరగబోతోంది.. జనసేన నేత రావెల సంచలన వ్యాఖ్యలు!
- జనసేన మద్దతుదారుల్ని లక్ష్యంగా చేసుకున్నారు
- ఓట్లను తొలగించేందుకు ఏజెన్సీని పెట్టుకున్నారు
- పవన్ కల్యాణ్ తెల్లకాగితం లాంటివారు
టీడీపీలో కుల వివక్ష, స్వార్థ రాజకీయాలను తట్టుకోలేకే తాను బయటకు వచ్చానని రావెల కిశోర్ బాబు తెలిపారు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకే జనసేనలో చేరినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో భారీగా నగదును వెదజల్లి అధికారంలోకి రావాలని టీడీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెల్లకాగితం లాంటివారని ప్రశంసించారు. పవన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని ప్రకటించారు.