మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే: మంత్రి ఈటల రాజేందర్
- కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
- విష ప్రచారాన్ని ప్రజలు ఆత్మగౌరవంతో తిప్పికొట్టారు
- ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మాకు బలాన్నిచ్చాయి
తెలంగాణ ఉద్యమంలో కుట్రలు, కుతంత్రాలు చేసినట్టే మహా కూటమిగా జతకట్టి మరోసారి వాటికి తెరదీశారని విమర్శించారు. కూటమి నాయకులు ఎన్ని విష ప్రయోగాలు చేసినా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిపథంలో నడుపుతామని అన్నారు.