Tamilnadu: తమిళ 'పవర్ స్టార్' శ్రీనివాసన్ కనిపించడం లేదని భార్య ఫిర్యాదు!

  • అదృశ్యమయ్యాడని భార్య జూలీ ఫిర్యాదు
  • ఇప్పటికే శ్రీనివాసన్ పై పలు పోలీసు కేసులు
  • ఊటీలో ఉన్నట్టు తెలియడంతో ఫిర్యాదు వెనక్కు
ప్రముఖ తమిళనటుడు 'పవర్ స్టార్'గా అభిమానుల్లో పేరున్న శ్రీనివాసన్ అదృశ్యమయ్యాడని ఆయన భార్య జూలీ ఫిర్యాదు చేయడం కలకలం రేపగా, ఆపై గంటల వ్యవధిలోనే దాన్ని ఆమె వెనక్కు తీసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీనివాసన్ పై న్యూఢిల్లీతో పాటు రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో కేసులున్నాయి.

 ఇటీవల ఓ వ్యక్తిని డబ్బు విషయంలో మోసం చేసినట్టు కూడా ఫిర్యాదు రిజిస్టరైంది. ఈ నేపథ్యంలో ఆయన అదృశ్యమయ్యారన్న ఫిర్యాదును అందుకున్న పోలీసులు, విచారిస్తుండగానే, ఆయన ఊటీలో ఉన్నారని తెలిసింది.  దీంతో ఆయన్ను కలిసేందుకు ఊటీ వెళ్లిన జూలీ, తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. ఆయనపై రిజిస్టర్ అయిన కేసులను విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Tamilnadu
Power Star
Srinivasan

More Telugu News