Telangana: తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఓటు.. వివరణ ఇచ్చిన జనసేన పార్టీ!

  • సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్
  • అవి ఇప్పటివి కాదన్న జనసేన పార్టీ
  • ఫేస్ బుక్ లో సందేశం పోస్ట్ చేసిన పార్టీ నేతలు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తున్నాయి. హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో జనసేనాని ఓటు వేసినట్లు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. పవన్ కల్యాణ్ 2018 తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదని జనసేన స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో 2014 ఎన్నికల నాటిదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫేస్ బుక్ లో జనసేన పార్టీ ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.
Telangana
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
casting vote
elections-2018

More Telugu News