Kukatpalli: హైదరాబాద్ లో యువకుడి సజీవదహనం!

  • కైతలాపూర్ డంపింగ్ యార్డులో మృతదేహం
  • బోరబండ వాసిగా గుర్తించిన పోలీసులు
  • కేసును విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగర శివార్లలోని కూకట్ పల్లి ప్రాంతంలో యువకుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రాంతంలోని కైతలాపూర్ డంపింగ్ యార్డు సమీపంలో ఈ ఉదయం జీహెచ్ఎంసీ కార్మికులు మృతదేహాన్ని చూసి, భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతుడిని బోరబండ, రాధాకృష్ణ నగర్ లో నివాసం ఉంటున్న జున్నాడ శ్రీనివాస్ (38)గా గుర్తించిన పోలీసులు, గత శుక్రవారం నుంచి అతను కనిపించడం లేదని బంధువులు తెలిపారని అన్నారు. కాగా, మృతుడి తలపై గాయాలు ఉండటంతో, హత్య చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు.
Kukatpalli
Kaitalapur
Dumping Yard
Dead Body

More Telugu News