లంచ్ టైమ్ అయిందంటూ పోలింగ్ బూత్ కు తాళం.. సూర్యాపేట జిల్లాలో సిబ్బంది నిర్వాకం
- తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఘటన
- 291వ పోలింగ్ బూత్ కు తాళం
- వాట్సాప్ లో ఫొటోలు పెట్టిన ఓటర్లు
నిబంధనల ప్రకారం భోజన సమయంలో పోలింగ్ సిబ్బంది ఒకరి తర్వాత మరొకరు వెళ్లి భోజనం చేసి రావాల్సి ఉంటుంది. పోలింగ్ ప్రక్రియ ఆగిపోకుండా సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు ఏ క్షణంలో వచ్చినా, వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడి పోలింగ్ సిబ్బంది తాళం వేసి వెళ్లిపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, పోలింగ్ సిబ్బంది మళ్లీ వచ్చి, తాళం తెరిచారు.