బ్రేకింగ్... సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందంటూ ఫోన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రేకింగ్... సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందంటూ ఫోన్!

  • న్యూయార్క్ కార్యాలయంలో బాంబుందని ఫోన్
  • గత అక్టోబర్ లో లభించిన బాంబు
  • రంగంలోకి దిగిన బాంబ్, డాగ్ స్వ్వాడ్
ప్రపంచ వ్యాప్తంగా వార్తా సేకరణ సేవలందిస్తున్న సీఎన్ఎన్, న్యూయార్క్ కార్యాలయంలో బాంబు ఉందన్న కలకలం చెలరేగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి కార్యాలయంలో బాంబు ఉందని చెప్పడంతో, ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. వార్తాసంస్థ లోని ఉద్యోగులందరినీ బయటకు పంపిన అధికారులు, ప్రస్తుతం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

గత అక్టోబర్ నెలలోనూ ఇదే తరహా బాంబు కాల్ రాగా, తనిఖీలు చేసిన అధికారులు ఓ బాంబును కనుగొని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయంలోని అణువణువూ గాలిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
CNN
New York
Bomb
FBI

More Telugu News