గుత్తా జ్వాల పేరు గల్లంతు... ఓటేసేందుకు వచ్చి ఉసూరుమంటూ వెనక్కి!
- బంజారాహిల్స్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన గుత్తా జ్వాల
- ఓటర్ల జాబితాలో పేరు లేదని చెప్పిన అధికారులు
- గత ఎన్నికల్లో ఓటు వేశానన్న జ్వాల
కాగా, బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల వ్యవధిలో తెలంగాణలో 10 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తున్నామని, ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు కొత్త ఈవీఎంలను, సాంకేతిక నిపుణులను పంపించామని అధికారులు వెల్లడించారు.