నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఎఫెక్ట్.. పిలేరు టీడీపీ మాజీ ఇన్ చార్జీ ఇక్బాల్ మొహమ్మద్ రాజీనామా
- టీడీపీని 25 సంవత్సరాలు నమ్ముకున్నాం
- నల్లారి కుటుంబంపై పోటీ చేసి నష్టపోయాం
- ఆదుకుంటామన్న చంద్రబాబు మాటతప్పారు
కిరణ్ కుటుంబీకులపై పోటీ చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఇప్పటివరకూ తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, కిరణ్ సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి తెచ్చారనీ, నియోజకవర్గం ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును చాలాసార్లు కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామనీ, అయినా పట్టించుకోలేదని వాపోయారు. బీజేపీతో విడిపోయాక బాబుకు ముస్లింలపై ప్రేమ పొంగుకువస్తోందని విమర్శించారు.