తెలంగాణలో ఎవరికి ఓటు వేయాలో చెప్పిన పవన్ కల్యాణ్!
- తెలంగాణ అంటే నాకు ఎనలేని గౌరవం
- సమయం లేక, సమయం కేటాయించలేక ఎన్నికల్లో పోటీ చేయలేదు
- తక్కువ అవినీతితో మంచి పాలన అందించేవారికి ఓటు వేయండి
తెలంగాణను ఇచ్చామనేవాళ్లు, తెలంగాణను తెచ్చామనేవాళ్లు, తెలంగాణను దించామనేవాళ్లు ఇప్పుడు మన ముందు ఉన్నారని... వారిలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయరాదనే అయోమయంలో అందరూ ఉన్నారని తెలిపారు. ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పాలనను అందిస్తారో... లోతుగా ఆలోచించి వారికి ఓటు వేయాలని చెప్పారు.