ఎన్ని కూటములు వచ్చినా.. టీఆర్ఎస్ దే అధికారం: ఇంద్రకరణ్ రెడ్డి
- తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం
- ప్రజాకూటమిని ప్రజలు నమ్మరాదు
- బూటకపు సర్వేలతో లగడపాటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు
కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ప్రజాకూటమి మాటలను ప్రజలు నమ్మరాదని, ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. బూటకపు సర్వేలతో లగడపాటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.