బాలకృష్ణపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఐటీ ఉద్యోగులు!
Add ap7am to your home Screen

బాలకృష్ణపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఐటీ ఉద్యోగులు!

  • ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగ్స్ నేర్పించామన్న బాలయ్య
  • ఈ వ్యాఖ్యలు ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి
  • రజత్ కుమార్ కు ఫిర్యాదు చేసిన ఐటీ ఉద్యోగుల సంఘం
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఐటీ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ ఉద్యోగులకు ఆంగ్ల పదాల స్పెల్లింగ్‌ నేర్పించామని చెప్పడం హాస్యాస్పదమన్న ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్‌ మక్తాలా, ఇటువంటి వ్యాఖ్యలతో ఐటీ ఉద్యోగుల మద్ద చిచ్చు రగిల్చాలని ఆయన చూశారని ఆరోపించారు. ఏ ఒక్కరి కృషి వల్లో తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధి సాధించలేదని అన్నారు. ఐటీ ఉద్యోగుల జోలికి రాకుండా, వారి ప్రస్తావన లేకుండా ఎవరి ప్రచారాన్ని వారు చేసుకునేలా చూడాలని రజత్ కుమార్ ను వారు కోరారు.
Telangana
IT
Balakrishna
CEC
Rajat Kumar

More Telugu News