తెలుగువాళ్లకు ఐటీ గురించి తెలియని రోజుల్లో చంద్రబాబు దానికి నిర్వచనం ఇచ్చారు!: బాలకృష్ణ
- చంద్రబాబు కట్టిన భవనాల్లో కేసీఆర్ ఉంటున్నారు
- ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారు
- ఓల్డ్ బోయిన్ పల్లి రోడ్ షోలో బాలయ్య
తెలుగుదేశం ఓ కులానికీ లేదా ఓ మతానికి పుట్టిన పార్టీ కాదని బాలయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నడిబొడ్డున ప్రజా మద్దతుతో టీడీపీ పుట్టిందని తెలిపారు. తెలుగువారికి కష్టం వస్తే బెంగళూరు, ఉత్తరాఖండ్ వరకూ వెళ్లి పోరాడామనీ, తెలుగు ప్రజలను ఆదుకున్నామని బాలయ్య గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ‘సమయం లేదు మిత్రమా.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోండి’ అంటూ బాలయ్య తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సారి తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.