పైపుల్లో తరలిస్తున్న డబ్బు పట్టివేత.. టీఆర్ఎస్ అభ్యర్థికి చెందినదిగా గుర్తింపు
- మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో పోలీసుల తనిఖీలు
- పీవీసీ పైపులో రూ.50 లక్షల నగదు పట్టివేత
- డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
ఈ సందర్భంగా పీవీసీ పైపులను తరలిస్తున్న ఓ ట్రాలీ అటువైపు నుంచి వెళ్తోంది. అయితే, ఓ పైపుకు చివర మూసివేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దాన్ని తనిఖీ చేయగా, పైపు లోపల రూ. 50 లక్షల నగదు బయటపడింది. ఈ నగదు టీఆర్ఎస్ అభ్యర్థికి చెందినదిగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నగదును తరలిస్తున్న ఓదేలు, బాల్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.