జగన్ పై దాడి కేసు.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!
- ఏపీ పోలీసులు ఎందుకు దర్యాప్తు చేపట్టారు?
- ఎన్ఐఏకు కేసును ఎందుకివ్వలేదు
- ప్రశ్నల వర్షం కురిపించిన ధర్మాసనం
ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను నిలిపివేయాలని కోరారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్నారు. ఈ వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఖండించారు.
సిట్ అధికారుల విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడంపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 5(ఎల్లుండికి)కు వాయిదా వేసింది.