lagadapati: లగడపాటి రాజగోపాల్ సర్వే ఓ బక్వాస్ సర్వే: టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఫైర్

షార్ట్స్‌లో చూడండి
లగడపాటి రాజగోపాల్ సర్వే ఓ బక్వాస్ సర్వే అంటూ టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను తికమక పెట్టేందుకు లగడపాటి చూస్తున్నారని, అందుకే, ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య వారధిగా పని చేసేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  

తెలంగాణకు పరోక్షపాలకుడు కావాలని చంద్రబాబు కుట్ర

ఏపీ సీఎం చంద్రబాబుపై వినోద్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు తాను పరోక్షపాలకుడు కావాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలను తిప్పికొట్టారు. చంద్రబాబు కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు.
Go Back to Shorts
lagadapati
TRS
mp
vinod
suvey

More Telugu News