కేసీఆర్ ని ఓడించి తెలంగాణను కాపాడుకోవాలి: చంద్రబాబు పిలుపు
- ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలి
- హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీయే
- ప్రతిష్టాత్మక సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చా
హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. నాడు హైదరాబాద్ అభివృద్ధి కోసం తాను ఎంతో శ్రమించానని, ప్రతిష్టాత్మక సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డానని అన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అమెరికాలో బిల్ గేట్స్ చుట్టూ తిరిగానని గుర్తుచేసుకున్నారు. దేశంలోకి సెల్ ఫోన్లు రావడానికి కారణం తానేనని, వాజ్ పేయితో పోరాడి జాతీయ రహదారులను తీసుకువచ్చానని చెప్పుకొచ్చారు.