‘అంతరిక్షం’ నుంచి ‘సమయమా’ లిరికల్ సాంగ్ రిలీజ్
- వరుణ్ తేజ్ హీరోగా ‘అంతరిక్షం’
- ప్రశాంత్ విహారి సంగీతం
- డిసెంబర్ 21న విడుదల
వరుణ్ తేజ్ సరసన అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘సమయమా’ వీడియోను నేడు చిత్రబృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.