తెలంగాణలో బీజేపీని తక్కువ అంచనా వేయొద్దు: కె.లక్ష్మణ్
- డిసెంబర్ 3న ఎల్బీ స్టేడియంలో మోదీ సభ
- సభ ఏర్పాట్లను పరిశీలించాం
- ఈ సభతో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి
ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను లక్ష్మణ్, పోలీసులు, ఎస్పీజీ అధికారులు పరిశీలించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. మోదీ సభతో తెలంగాణలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని, ఎన్నికల్లో తమ విజయం ఖాయమని జోస్యం చెప్పారు.