'మణికర్ణిక'కి దర్శకత్వం వహించడం పెద్ద కష్టంగా అనిపించలేదు: కంగనా రనౌత్
- దర్శకత్వం చేయడంలో అనుభవం వుంది
- కష్టపడటం నాకు అలవాటే
- సమస్యలను అధిగమించాను
"దర్శకత్వం చేయడం నాకేం కొత్తకాదు .. నా 23వ యేటనే ఒక లఘు చిత్రాన్ని రూపొందించాను .. అందుకోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశాను. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఒక్కసారిగా స్వీకరించడం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని నేను అధిరోహించగలిగాను. నా ప్రతి సినిమాకి నేను చాలా కష్టపడతాను .. ఈ సినిమాకి అంతకంటే కొంచెం ఎక్కువగా కష్టపడవలసి వచ్చిందంతే. అంతకి మించి నాకు పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు" అని చెప్పుకొచ్చింది.