టెక్నాలజీ తికమక.. జీపీఎస్ చెప్పిందని కారును రైలు పట్టాలపైకి తీసుకెళ్లిన మహిళ!
- అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఘటన
- ఘటనాస్థలానికి చేరుకుని కాపాడిన పోలీసులు
- మద్యం, డ్రగ్స్ తీసుకోలేదని పరీక్షలో వెల్లడి
అగ్రరాజ్యం అమెరికాలోని డుక్వెన్స్ పట్టణంలో కొన్నిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్ పై కారు ఆగిపోయిన ఘటనలో అధికారులు సదరు మహిళకు డ్రగ్స్, బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా, నెగటివ్ ఫలితాలు వచ్చాయి. అలాగే ఆమెకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. కాగా, ఈ ఫన్నీ ఘటనను అమెరికా పోలీసులు ఫేస్ బుక్ లో పంచుకున్నారు.