Pawan Kalyan: కురులు సర్దడం, బుగ్గలు నిమరడం... మరేమీ చేతగాని జగన్: పవన్ కల్యాణ్
తనను కలిసిన మహిళల కురులు సర్దడం, వారితో సెల్ఫీలు దిగడం, బుగ్గలు నిమరడం మినహా మరేమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు చేతకాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని జగన్ తో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగబోదని అన్నారు. తన ఎమ్మెల్యేలతో కలసి పలాయనం చిత్తగించిన ఆయన వైఖరి వల్లే చంద్రబాబు, లోకేశ్ దోపిడీ రాజ్యానికి అడ్డు లేకుండా పోయిందని పవన్ ఆరోపించారు.
రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కోనసీమలో గ్యాస్ ను దోచుకుని వెళుతున్నా చంద్రబాబు మిన్నకున్నారని ఆరోపించారు. చంద్రబాబు వంటి వ్యక్తుల నుంచి దక్షిణ భారత నినాదం వస్తుందనుకున్నానని, కానీ, ఆయన నాలుగేళ్ల పాటు మోదీ కొంగుపట్టుకుని తిరిగారని ఆరోపించారు. బీజేపీ హిందీ పార్టీ అయినప్పటికీ, తెలుగు భాషను చంపుకునే విషయంలో తాను రాజీ పడబోనని, హిందీని రుద్దుతామంటే అంగీకరించనని చెప్పారు.