హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. యువకుడి నరికివేత
- సహచర ఆటో డ్రైవర్ను నరికి చంపిన నిందితుడు
- అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను కత్తితో బెదిరించిన వైనం
- పోలీసుల అదుపులో హంతకుడు
అబ్దుల్ దారుణానికి పాల్పడుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కత్తితో బెదిరించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.