తమిళనాడు నుంచి వచ్చి... ఏపీలో ప్రేమజంట ఆత్మహత్య!
- తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన మౌనీషా, హేమ చంద్ర
- కుప్పం స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య
- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
మౌనీషా తిరువళ్లూర్ యూనివర్శిటీలో బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతున్నట్టు గుర్తింపు కార్డు లభించింది. దీంతో వారిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉండివుండవచ్చని, తామిక కలసి వుండలేమన్న భావనతో కుప్పంకు వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అధికారులు తెలిపారు.