ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు మహాముని శాపముంది.. ఆయన నిజాలు మాట్లాడితే అంతే!: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబును ఓ మహా ముని శపించారు
  • నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందన్నారు
  • బాబు గురించి హసన్ అలీ అప్పుడే చెప్పాడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓ మహాముని శాపం ఉందని వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. పొరపాటున నిజం మాట్లాడితే బాబు తల వెయ్యి ముక్కలు అవుతుందని ఓ మునీశ్వరుడు శపించాడని వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా మాట్లాడటం లేదనీ, ఈ జన్మలో మాట్లాడరని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు విదేశీ అక్రమ ఆర్థిక వ్యవహారాల ముచ్చట ఈ నాటిది కాదని విజయసాయి రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని ఆక్రమించుకున్నప్పుడే చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అక్రమాలకు శ్రీకారం చుట్టారని పరోక్షంగా సుజనా చౌదరిని గుర్తుచేశారు.

చంద్రబాబు హవాలా మార్గంలో వందల కోట్లను దేశం దాటించాడని గుర్రపు పందేల వ్యాపారి హసన్ అలీ ఈడీ అధికారుల దర్యాప్తులో బయటపెట్టలేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ఏపీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు.
Go Back to Shorts
Andhra Pradesh
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
cursed
Telugudesam
truth
muni

More Telugu News