sharwanand: కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన శర్వానంద్

షార్ట్స్‌లో చూడండి
కథలో కొత్తదనం .. పాత్రలో వైవిధ్యం వుంటేనే శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన తాజా చిత్రంగా 'పడి పడి లేచె మనసు' వచ్చేనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత శర్వానంద్ .. సుధీర్ వర్మ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ దర్శకత్వ శాఖలో పనిచేస్తూ వచ్చిన ఒక కుర్రాడు, శర్వానంద్ కి ఒక లైన్ చెప్పాడట. ఆయనకి బాగా నచ్చడంతో పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పినట్టుగా సమాచారం. ఈ సినిమాను నిర్మించడానికి యూవీ క్రియేషన్స్ వారు ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. గతంలో ఈ బ్యానర్లో శర్వానంద్ సినిమాలు ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. సుధీర్ వర్మ సినిమా తరువాత శర్వానంద్ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించనున్నాడని అంటున్నారు.  
Go Back to Shorts
sharwanand

More Telugu News