మరో రెండు రోజుల్లో టీఆర్ఎస్ కు షాక్ తగలబోతోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- టీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో వలసలు ఉన్నాయి
- టీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు
- సోనియా సభకు మహాకూటమి నేతలందరినీ ఆహ్వానించాం
ప్రజలకు ఇచ్చిన మాటలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుపుకోలేదని ఉత్తమ్ అన్నారు. ముస్లింలు, గిరిజనులు, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగున్నాయని చెప్పారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మహాకూటమే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ఈ సాయంత్రం మేడ్చల్ లో జరగనున్న సభలో సోనియాగాంధీకి పౌరసన్మానం జరుగుతుందని... ఈ సభకు మహాకూటమి నేతలందరినీ ఆహ్వానించామని చెప్పారు.