ఈవీఎం ముందు కొబ్బరికాయ కొట్టి, అగర్ బత్తీలు... అడ్డంగా బుక్కయిన బీజేపీ క్యాండిడేట్!
- చత్తీస్ గఢ్, నవాఘడ్ అభ్యర్థిగా దయాళ్ దాస్ భాగేల్
- మళ్లీ గెలవాలని ఈవీఎంలకు పూజలు
- నోటీసులు పంపించిన ఎన్నికల కమిషన్
ఇక ఓటు వేసేందుకు వెళ్లిన ఆయన, ఈవీఎంకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయకొట్టి, అగరుబత్తీలు వెలిగించి, ఇంకోసారి విజయలక్ష్మి తననే వరించాలని మొక్కాడు. ఈ విషయం తెలుసుకున్న ఈసీ వెంటనే అతనికి నోటీసులు జారీ చేసి, సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దయాళ్ దాస్ బాగేల్ నుంచి సమాధానం రాగానే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుబ్రత్ సాహూ వెల్లడించారు.