రెండు సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టేసిన నితిన్
- వెంకీ కుడుములతో నితిన్
- డిసెంబర్లో సెట్స్ పైకి 'భీష్మ'
- గీతా ఆర్ట్స్ 2పై తదుపరి సినిమా
వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్న సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక ప్రతాప్ దర్శకత్వం వహించనున్న సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలను ఒకేసారి చేస్తూ వెళ్లేలా నితిన్ ప్లాన్ చేసుకున్నాడు. హిట్ కోసం ఆయన చేస్తోన్న నిరీక్షణ ఈ సారైనా ఫలిస్తుందేమో చూడాలి.