ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'

  • ఆకాశ్ హీరోగా మరో సినిమా
  • దర్శకుడిగా అనిల్ పరిచయం 
  • గోవా నేపథ్యంలో చిత్రీకరణ  
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ హీరోగా చేసిన 'మెహబూబా' యూత్ నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అయితే అంతటితో పూరి తన ప్రయత్నాలను మానుకోలేదు. మళ్లీ ఆకాశ్ హీరోగా ఒక సినిమా చేయడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకి కథాకథనాలు పూరీనే సిద్ధం చేశాడు.

ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితం కానుంది. అందువలన ఈ సినిమాకి 'రొమాంటిక్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అనిల్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయిందనీ .. లొకేషన్ల ఎంపిక కూడా జరిగిపోయిందని అంటున్నారు. గోవా బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువ చిత్రీకరణ జరపనున్నారని చెబుతున్నారు. కథానాయిక ఎవరనే విషయంతోపాటు, మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.    
Go Back to Shorts
akash

More Telugu News