కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. మర్రి శశిధర్ రెడ్డికి మళ్లీ షాకే!
Add ap7am to your home Screen

కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. మర్రి శశిధర్ రెడ్డికి మళ్లీ షాకే!

  • ఆరుగురితో కూడిన తుది జాబితా విడుదల
  • మిర్యాలగూడ నుంచి ఆర్.కృష్ణయ్య
  • సికింద్రాబాద్ నుంచి కాసాని
నామినేషన్ల ఘట్టం ముగియనున్న వేళ కాంగ్రెస్ ఆరుగురితో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి అధిష్ఠానం మరోమారు షాకిచ్చింది. అలాగే, తొలి మూడు జాబితాల్లో చోటు దక్కించుకోలేక, చివరి వరకు వేచి చూసిన వారి ఆశలు కూడా అడియాసలే అయ్యాయి. దీంతో వారు తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నారు. ఇక, మొత్తం 94 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ తొలి జాబితాలో 65 మంది, రెండో జాబితాలో 10 మంది, మూడో జాబితాలో 13, తుది జాబితాలో ఆరుగురికి చోటు కల్పించింది.  

తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. మిర్యాలగూడ నుంచి ఆర్. కృష్ణయ్య, దేవరకద్ర నుంచి డాక్టర్ పాబన్ కుమార్ రెడ్డి, నారాయణపేట నుంచి వామనగిరి కృష్ణ, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నారాయణఖేడ్ నుంచి సరేశ్ కుమార్ షెక్తార్, కోరట్ల నుంచి జువ్వాడి నర్సింగ్ రావు పోటీ పడనున్నారు. తుది జాబితాలో చోటు దక్కించుకున్న నేతలంతా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Congress
Final list
R.krishnaiah
Nominations
Telangana

More Telugu News