మహిళా కానిస్టేబుల్ ను రేప్ చేసి వీడియో తీసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ!
- నవీ ముంబైలో విధులు నిర్వహిస్తున్న అమిత్ షెలార్
- గత సంవత్సరం మార్చిలో మత్తుమందిచ్చి అత్యాచారం
- ఆపై పలుమార్లు బెదిరించి లొంగదీసుకున్న అమిత్
- కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు
ఆ ఘటనను వీడియో తీసి, పలుమార్లు బెదిరించి లొంగదీసుకున్నాడు. కొన్నిసార్లు కొట్టాడు కూడా. సీబీడీ, పాన్వెల్, కామోత్, ఖర్ గర్ ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు అమిత్ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం మేరకు కేసు నమోదు చేశామని చెప్పిన పోలీసులు, విచారణ జరుపుతున్నామని తెలిపారు. 2010లో నిందితుడు, బాధితురాలు ఒకే పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహించారని తెలుస్తోంది.