syra: ‘సైరా’ మూవీ అప్ డేట్.. నయనతార మోషన్ టీజర్ విడుదల!

షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ తో చారిత్రక నేపథ్యంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, నయనతార సహా పలువురు హేమాహేమీ నటులతో ఈ క్రేజీ ప్రాజెక్టును దర్శకుడు సురేందర్ రెడ్డి చేపట్టారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ తాజాగా మోషన్ టీజర్ ను విడుదల చేసింది.

ఈరోజు నయనతార పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ‘నయనతార మోషన్ టీజర్‘ను రిలీజ్ చేసింది. నయనతారకు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమాలో నయనతార పేరు ‘సిద్దమ్మ’గా ఉంటుందని వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.
Go Back to Shorts
syra
Chiranjeevi
Talking Movies
nayanatara
motion teaser released

More Telugu News