Telangana: టూ వీలర్ పై రూ. 23 లక్షల నగదు తీసుకెళుతుంటే పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
తన టూ వీలర్ పై సరైన పత్రాలు లేకుండా రూ. 23 లక్షల నగదును తీసుకు వెళుతున్న హైదరాబాద్ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, మెహిదీపట్నంకు చెందిన గోవర్ధన్ రెడ్డి అనే యువకుడు, రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తున్నాడు. మాదాపూర్ నుంచి మెహిదీపట్నం వెళుతున్న అతన్ని నిన్న ట్యాంక్ బండ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు ఆపి తనిఖీలు చేయగా, రూ. 23 లక్షలు కనిపించాయి. వీటికి సంబంధించిన ఎటువంటి రసీదులు అతని వద్ద లేకపోవడంతో, ఆ డబ్బును మాదాపూర్ పోలీసులకు అప్పగించామని, అతనిపై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 
Go Back to Shorts
Telangana
Elections
Tankbund
SOT Police
Cash

More Telugu News