అశ్వారావుపేటలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ: టీపీసీసీ మహిళా విభాగం కార్యదర్శి నాగమణి
- బలం ఉండి ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడం బాధనిపించింది
- నాలుగున్నరేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేశాను
- అధిష్ఠానం నాకే టికెట్ ఇస్తుందన్న నమ్మకంతోనే నామినేషన్ వేశా
ములకపల్లి మండలం గుట్టగూడెంలో నియోజకవర్గం స్థాయి ముఖ్య నేతలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం ఉండగా, అంతంతగా బలం ఉన్న టీడీపీకి సీటు వదుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలపడేందుకు ఎంతో కృషిచేశానని, నా కృషిని గుర్తించి అధిష్ఠానం తనకే టికెట్టు ఇస్తుందన్న నమ్మకం, కార్యకర్తల మనోభావాల మేరకే నామినేషన్ దాఖలు చేశానన్నారు. చివరికి మొండిచెయ్యి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సమావేశానికి హాజరైన ములకపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, దమ్మపేట మండలాల పార్టీ అధ్యక్షులు నాగమణి వెంటే నడుస్తామని ప్రకటించారు.