భార్య కూర వండడం ఆలస్యమవుతోందని.. కన్న కూతురిని కడతేర్చిన తండ్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య కూర వండడం ఆలస్యమవుతోందని.. కన్న కూతురిని కడతేర్చిన తండ్రి

  • మాంసం వండడం ఆలస్యమయిందని ఆగ్రహం
  • వేగంగా పూర్తిచేయాలని కోరినా భార్య పట్టించుకోలేదని అసహనం
  • పక్కనే ఆడుకుంటున్న చిన్నారిని ఇష్టానుసారం కొట్టడంతో మృతి
క్షణికావేశం, మూర్ఖత్వం, విచక్షణ కోల్పోవడం వంటి కారణాలతో ఒక్కోసారి ఎంతటి దారుణం జరుగుతుందనేందుకు ఈ ఘటన ఉదాహరణ. భార్యపై కోపం పట్టలేక నాలుగేళ్ల కన్నకూతుర్ని కొట్టి చంపాడో వ్యక్తి. బీహార్‌ రాష్ట్రం పూర్ణిమా జిల్లా ఫకిట్రోలి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన శంబులాల్‌ శర్మ ఉపాధి పనుల కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. ఛాట్‌ పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం శర్మ భార్య మాంసం వండుతోంది. వాసన ఘుమఘుమలాడిస్తుండడంతో శర్మ నోరూరింది. తినాలన్న ఆత్రుతలో వంట వేగంగా పూర్తి చేయాలని భార్యను కోరాడు. అయినా వంట పూర్తికాలేదు.

అసహనానికి గురైన శర్మ వంట వేగంగా పూర్తి చేయాలని మళ్లీ మళ్లీ ఆమెను కోరాడు. అయినా ఆమె పట్టనట్లు వ్యవహరించడంతో తట్టుకోలేకపోయాడు. ఆగ్రహం అపుకోలేక పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల కుమార్తెను పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కూతురిని తీసుకుని భార్య ఆస్పత్రికి పరుగెత్తింది.

అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లి భోరుమంది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు శర్మను అరెస్టు చేశారు.  
Crime News
behar
daughter murder

More Telugu News