చంద్రబాబు చాలా తెలివైన వారు: మాజీ సీఎం నల్లారి కీలక వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి మేలు
- ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు
- ఏ జట్టులో ఉంటారో జగన్, పవన్ తేల్చుకోవాలి
- గుత్తిలో నల్లారి కిరణ్ కుమార్
చంద్రబాబు దూరదృష్టితో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని అభినందించారు. వైఎస్ఆర్ సీపీ, పవన్ కల్యాణ్ పార్టీలు ఏ జట్టులో ఉంటాయో తేల్చుకోవాలని, కాంగ్రెస్ వైపు కాకుండా, బీజేపీ వైపు వారుంటే, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టేనని చెప్పారు. ప్రజలకు మేలు జరగాలంటే, కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలని అన్నారు. రాహుల్ ప్రధాని అయితే, ఏపీకి మేలు కలుగుతుందని, ఆ నమ్మకం చంద్రబాబుకు కలిగిందని, ఈ విషయంలో పవన్, జగన్ ఆలోచించుకుని రాష్ట్రానికి మంచి జరిగేలా నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.