అఫిడవిట్లు చూస్తే అవాక్కే... కిలోల కొద్దీ బంగారాన్ని కలిగున్న అభ్యర్థుల భార్యలు!
- పలువురి భార్యల వద్ద భారీ ఎత్తున బంగారం
- కేసీఆర్ భార్య శోభ వద్ద 2.2 కిలోలు
- దామోదర రాజనర్శింహ భార్య వద్ద 2 కిలోల బంగారం
ఇక పటాన్ చెరు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గోక శశికళ, తన పేరిట కిలో బంగారం ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని గీతారెడ్డి వద్ద 60 తులాలు, ఆమె భర్త వద్ద 20 తులాల బంగారం ఉండగా, నర్సాపూర్ నేత సునీతా లక్ష్మారెడ్డి వద్ద 25 తులాల బంగారం ఉంది. ఆంధోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్, తన భార్య పేరిట, అందరికన్నా తక్కువగా 8.5 తులాల బంగారం ఉన్నట్టు చూపించారు.
వీరితో పాటు జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి మానిక్ రావు భార్య వద్ద 90 తులాలు, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి శశిధర్ రెడ్డి వద్ద 40 తులాలు, హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ భార్య వద్ద 35 తులాల బంగారం ఉందట. ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాబూమోహన్, తన భార్య వద్ద 20 తులాల గోల్డ్ ఉన్నట్టు అఫిడవిట్ లో చూపించారు.