నీకో అవకాశం కల్పిస్తా: గాయని పసల బేబీకి మురళీమోహన్ హామీ
- నెట్టింట పసల బేబి పాటలు వైరల్
- సన్మానించిన ఎంపీ మురళీమోహన్
- తనకున్న పరిచయాలతో అవకాశం ఇప్పిస్తానని హామీ
రంగంపేట మండలం వడిశలేరులో ఆమెను సత్కరించి, నగదు ప్రోత్సాహకాన్ని అందించిన మురళీమోహన్, తన నియోజకవర్గ మహిళ, ఇలా సంగీత ప్రియులను ఆకట్టుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా బేబీ, మురళీమోహన్ చిత్రంలోని "ఏ రాగమో...ఇది ఏ తాళమో..." అన్న పాట పాడి అందరినీ అలరించింది.