janagaon: జనగామ నుంచి నేను పోటీ చేసే విషయంపై ఏమీ మాట్లాడలేను: ప్రొఫెసర్ కోదండరామ్

షార్ట్స్‌లో చూడండి
జనగామ నుంచి తాను పోటీ చేసే విషయమై ఏమీ మాట్లాడలేనని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీజేఎస్ కు 11 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నామని, ఇప్పటికైతే తమకు 6 స్థానాలపై స్పష్టత ఉందని చెప్పారు. మల్కాజ్ గిరి, మెదక్, దుబ్బాక, సిద్దిపేట, వర్థన్నపేట, అంబర్ పేట స్థానాలపై స్పష్టత వచ్చిందని అన్నారు. మరికొన్ని స్థానాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉందని, తాము పోటీ చేసే అన్ని స్థానాలపైనా స్పష్టత వచ్చాక వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ సీటు తమ పార్టీకి కేటాయించాలని కోరుతున్నామని కోదండరామ్ చెప్పారు.
Go Back to Shorts
janagaon
tjs
prof.kodandaram

More Telugu News